Header Banner

పాకిస్థాన్ చెరలో భారత వీరుడు! సరిహద్దు దాటి ప్రమాదంలో.. విడుదల కోసం ప్రయత్నాలు వేగవంతం!

  Fri Apr 25, 2025 12:23        India

పాకిస్థాన్ రేంజర్లు భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఓ జవాన్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ వద్ద నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. పాక్ రేంజర్ల అదుపులో ఉన్న జవాన్‌ను 182వ బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్‌గా గుర్తించారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఫిరోజ్‌పూర్ వద్ద ఇండో-పాక్ సరిహద్దు సమీపంలో విధి నిర్వహణలో భాగంగా కొందరు రైతులతో కలిసి ఉన్న సమయంలో, ఆయన పొరపాటున సరిహద్దు రేఖ దాటి పాకిస్థాన్ వైపు వెళ్లినట్లు సమాచారం. జవాన్ పీకే సింగ్‌ను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత ఆర్మీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.

ఇరు దేశాల మధ్య ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్‌లు నిర్వహించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం సాధారణ సైనిక ప్రక్రియ అని అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా పౌరులు లేదా సైనికులు పొరపాటున సరిహద్దు దాటిన సందర్భాలు ఉన్నాయని, వాటిని ఇదే పద్ధతిలో పరిష్కరించారని గుర్తు చేశారు. పట్టుబడిన సమయంలో జవాన్ సింగ్ విధి నిర్వహణలో భాగంగా యూనిఫామ్‌లోనే ఉన్నారని, ఆయన వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, గతంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో తాజా పరిణామంపై కొంత ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్బంధాన్ని పాకిస్థాన్ ఇతర అంశాలతో ముడిపెట్టే అవకాశం ఉందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జవాన్ విడుదల కోసం చర్చలు కొనసాగుతున్నాయి.


ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్! దాని గురించే చర్చ! పోరాటం కొనసాగిస్తామని...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi